కమ్యూనిస్టుల నాయకత్వంలోనే నాటి వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందనేది చరిత్ర చెప్పే వాస్తవమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు కురవి మండలo అయ్యగారిపల్లి గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద అరుణపతకాన్ని ఎగురవేసి, జోహార్లు అర్పించి, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశపాలన పై, రజాకార్ల అకృత్యాలపై, దొరల దేశ్ముక్ ల దౌర్జన్యాల పై కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని పోరాటం సాగి వేల మంది బలిదానాలతో 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిన పార్టీ సిపిఐ అన్నారు.