భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి, పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య మానేరు వారిలో ఉదయం ఇసుక కోసం వెళ్ళిన 11 ట్రాక్టర్లలో ముందుగా నాలుగు ట్రాక్టర్లు ఇసుక నింపుకున్న నేపథ్యంలో భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో నాలుగు ట్రాక్టర్లు బోల్తాపడగా, డ్రైవర్లను జెసిబి సాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు టేకుమట్ల ఎస్సై సుధాకర్. భారీ వర్షాలకు మానేరు వాగు ఉప్పొంగడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు ఎస్సై సుధాకర్.