విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాల అంగన్వాడీ చౌక ధర దుకాణాలను కమిషన్ సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పాఠశాలలు అంగన్వాడీలలో విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించేందుకు ప్రణాళిక బద్ధంగా మేనను రూపొందించిందని దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలని అన్నారు.