శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని పోలీస్ అధికారులు గట్టి చర్యలను చేపట్టారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వినాయక మండపాల వద్ద పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు. అలాగే వినాయక నిమజ్జనం లో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.