జిల్లాలో యూరియా సక్రమంగా సకాలంలో సరఫరా అయ్యేలా హోల్సేల్ డీలర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా సక్రమంగా సకాలంలో సంబంధిత రిటైల్డ్ డీలర్లకు సరఫరా అయ్యేలా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు హోల్సేల్ డీలర్లకు సూచించారు. గురువారం మద్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక మచిలీపట్నంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ తో కలిసి వ్యవసాయ అధికారులు, హోల్సేల్ డీలర్లు, రవాణాదారులతో యూరియా సరఫరా పై సమావేశం నిర్వహించి సమీక్షించారు.