జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్ , ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.