కె.గంగవరం మండలం, కోటిపల్లి వద్ద గోదావరి పొంగి ప్రవహిస్తుంది. దీంతో పుష్కర్ ఘాట్ పూర్తిగా నీట మునిగింది. పెరుగుతున్న వరదతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోటిపల్లి లంకలో కూరపాదులు, అరటి తోటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయని స్థానికులు వాపోయారు. మళ్లీ గోదారి వరద పెరగడంతో ఆందోళన చెందుతున్నారు