కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్ర రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు జనార్దన్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు అన్నారు.