కర్నూలులో 4వ తేదీన జరగబోయే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్ కలిసి కేసీ కెనాల్ ఘాట్ను తనిఖీ చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఉత్సవ సమితి నాయకులు వినాయక నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.