ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం నవాబుపేట గ్రామం లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. ఇంట్లో ఉన్నట్టుండి పడి పోయి మృతి చెందిందని భర్త కుటుంబ సభ్యులకు తెలపడంతో భర్త తో వాగ్వాదం చోటుచేసుకుంది. మృతురాలు అంకుపల్లి మౌనిక గా తెలుస్తోంది ఆమెది సహజ మరణం కాదని మృతురాలి అన్న పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేసాడు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు