ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో టైఫాయిడ్ కలకలం రేగింది. ఇంటర్, వృత్తి విద్యా కళాశాలల్లో డీఎంఎల్డీ, ఎంఫీహెచ్ డబ్ల్యూ కోర్సులు చేస్తున్న 13 మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడ్డారు. వీరికి ఆదివారం ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా సోమవారం టైఫాయిడ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.