ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీశక్తి' పథకంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఏలూరుజిల్లా పోలవరం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పోలవరం ఆర్టీసీ బస్సుల్లో, స్థానిక మార్కెట్లో ఆటోడ్రైవర్లు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. 'ఫ్రీ బస్సు వద్దంటూ.. ఆటోడ్రైవర్ల పొట్ట కొట్టొద్దు' అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదుకోకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఈ సందర్బంగా ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.