కర్నూల్ ఉల్లిమార్కెట్లో వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేయడంలేదని, రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉల్లి మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఉల్లి సీజన్ మొదటి వారంలోనే 13 వేల క్వింటాలకు పైగా ఉల్లి పంట మార్కెట్ కు రావడంతో కొనుగోలు లేక అవస్థలు పడుతున్నారని అధికారులు చెబుతుండగా.. వ్యాపారస్తులు కుమ్మక్కై ఉల్లి పంట కోగూగోలు చేయడం లేదని ఫిర్యాదుల రావడంతో రైతుల నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం ఎవరి పై చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి