ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించాలని వైసీపీ నాయకులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి కోరారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో అభివృద్ధి పనులకు గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి భూమి పూజ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, కాల్వలు, తాగునీటి పైపులైన్ పనులను చేపట్టినట్లు స్థానిక వార్డు కౌన్సిలర్ శివజ్యోతి తెలిపారు. రూ.25 లక్షల అంచనాతో పనులు చేపట్టినట్లు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య తెలిపారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.