ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు తిమ్మప్ప, శుక్రవారం వారి నివాసంలో ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. ఈనెల 25వ తేదీన బైక్ ర్యాలీ ఉంటుందని ప్రతి ఒక్కరు పాల్గొని మద్దతు తెలియజేయాలని వారు కోరారు. పెద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడం ద్వారా ఇక్కడ ఉన్న రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్నారు.