చియ్యవరం గ్రామసభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి, ఏడీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అవకతవకలకు పాల్పడ్డారని, దీంతో రైతులు తమ భూములను కోల్పోయే అవకాశం ఉండడంతో సర్వే నిర్వహించినట్లు ఎమ్మెల్యే బొజ్జల అన్నారు.