ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ సమీపంలో కొండవీడు రైలు భోగి డోరు వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న ప్రయాణికుడు హరిబాబు కింద పడిపోయాడు. సహచర బంధువులు వెంటనే చైన్ లాగి రైలు ఆపారు. లోకో పైలట్లు అధికారుల అనుమతితో 1.5 కిలోమీటర్ల రైలును వెనక్కి తీసుకెళ్లి అతడిని భోగిలోకి ఎక్కించి మార్కాపురంలో దింపారు. అనంతరం హాస్పటల్ కు తరలించారు. గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు కు చెందిన హరిబాబు పరిస్థితి విషమించి మరణించినట్లుగా కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు.