మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై చేసిన వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంచిర్యాలలో గుండాయిజం, రౌడీయిజం, గంజాయిని మాజీ ఎమ్మెల్యే దివాకర్ కొడుకు విజిత్ రావు పెంచి పోషించాడని ఆరోపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారనీ కానీ మంచిర్యాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.