నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శనివారం లక్ష్మణచందా మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు రహదారులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి వరద నీటిని గోదావరిలోకి విడుదల చేయడంతో పరివాహక ప్రాంతంలో పంట నష్టం తీవ్రంగా జరిగిందని అన్నారు. అలాగే రోడ్లు కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయలని కోరారు. వరద ముంపు పరిహారం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.