నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ముందల భూ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 48వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు జోషి ఆదివారము11: 30 గం సమయంలో హాజరై మద్దతు తెలుపుతూ ప్రసంగించారు.భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి డా.వాకిటి శ్రీహరి మన జిల్లా వాసులే అయినప్పటికీని భూ నిర్వాసితులకు సరైన పరిహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన స్పందించి ప్రభుత్వం భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని కోరారు.