అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిత్యం వాహనాలతో కలకలలాడే పాయింట్ చంద్రగ్రహణం కారణంగా బోసిపోయింది. టీటీడీ శ్రీవారి ఆలయాన్ని మూడు గంటల 30 నిమిషాలకు మూసివేయనున్న నేపథ్యంలో అందరూ స్వామివారి దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. టిటిడి సైతం సర్వదర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద నిర్మానుషంగా మారింది.