జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25 కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా RAMP పథకం గురించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా పరిశ్రమ కేంద్రం అధికారి శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు.