కర్నూలు నగరంలోని రహదారి విస్తరణ పనులను త్వరలో ప్రారంభించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ఉస్మానియా కళాశాల వద్ద విస్తరణ పనులు చేపట్టాల్సిన రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు మాస్టర్ ప్లాన్ (ఆర్డీపి-2) ప్రకారం రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఆస్తి ప్రభావిత యజమానులకు పరిహారం త్వరలో అందిస్తామని, మొత్తం 740 మీటర్ల పొడవున పనులు జరుగుతాయని, దాదాపు 183 యజమానుల ఆస్తులు ప్రభావితమవుతాయి.