రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని పోచమ్మ బోనాలు గురువారం ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు అమ్మవారికి సమర్పించి ఆరాధించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు మహేశ్వరం జోన్ డిసిపి సునీత రెడ్డి ఏసిపి జానకి రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేకమైన పూజలను చేపట్టారు. భక్తులు యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.