కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని రాద్ధాంతం చేస్తుందని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని బారాస వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వినూత్న రీతిలో తబలా వాయిస్తూ నిరసన తెలిపారు అనంతరం అమరవీరుల స్తూపానికి నీళ్లతో కడిగారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు