మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ క్రీడలో పెద్ద శంకరంపేట ఎం జె పి విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు బుధవారం ఎం జె పి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీను మాట్లాడుతూ మెదక్ జిల్లా స్థాయి గేమ్స్ లో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లా పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా స్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పి ఈ టి రామారావును, విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.