సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం లారీ అకస్మాత్తుగా పల్టీ కొట్టి రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది ఎదురయింది.విషయం తెలుసుకున్న కోహిర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.