యాదాద్రి భువనగిరి జిల్లా: గత పది ఏండ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం బోధన భూములను అమ్ముకొని భూదాన యజ్ఞ బోర్డు లేకుండా చేసి పేదల కడుపు కొట్టిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కులో ఆచార్య వినోభ భావి 130వ జయంతిని నిర్వహించారు. అనంతరం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.