పాణ్యం మండలంలోని కొండజూటూరు నుండి ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ చోరవతో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. మంగళవారం పాణ్యం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ బస్సును కేజే శ్రీనివాసరావు, ముని ఏసరత్నం, గూని యేసయ్య, టోపీ సత్తిబాబు, టోపీ రోశన్న ప్రారంభించారు. నిత్యం పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేదని కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించారు. విద్యార్థుల ప్రయాణ సౌలభ్యం కోసం ఈ సేవ ప్రారంభించినట్లు వారు తెలిపారు.