చంద్రగ్రహణం.. మూఢ నమ్మకాలు వీడండి: జనవిజ్ఞాన వేదిక చంద్రగ్రహణం రోజున మూఢ నమ్మకాలు వీడాలంటూ జన విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు.ఇది పూర్తిగా ఖగోళ సహజ సంఘటన అని పేర్కొంటున్నారు. గ్రహణం సందర్భంగా అరటిపళ్లు తిని చూపించారు. దీనికి శరీరానికి, కడుపులోని పిండానికి, ఆహారానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. గ్రహణంతో మొర్రి రాదని, మేనరికపు వివాహాలే దీనికి కారణమన్నారు.