విజయనగరం జిల్లా జామి మండలం అలమండ పెట్రోల్ బంక్ సమీపంలో రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు మోటార్ బైకులు పై ప్రయాణిస్తున్న వ్యక్తులను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడకక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో కొత్తవలస నుంచి అలమండ వైపు వస్తుండగా అలమండ నుంచి ఎదురుగా మూడు మోటార్ బైక్ లపై వెళుతున్న వ్యక్తులను బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు సమీప గోడను ఢీకొట్టడంతో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు.