నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని, వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించా