వినుకొండ నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్లీమళ్లీ తిప్పించుకోకుండా పనులు పూర్తిచేయాలని, అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకానికి అర్థం ఉంటుందన్నారు ప్రభుత్వచీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రతి సమస్య అధికారులు, ఉద్యోగులు వీలైనంత వరకు స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపడం అవసరమని స్పష్టం చేశారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు నేరుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.