మట్టి వినాయక విగ్రహాన్ని పూజించాలని కోరుతూ సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల చెరువులో జలాలు కలుషితం అవుతాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ భారతి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిద్ధులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.