విధినిర్వంలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై మద్యం మత్తులో ముగ్గురు యువకులు దాడికి పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రాజమండ్రి లో సంచలనం సృష్టించింది . రాజమండ్రి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఏ విధమైన కేసు నమోదు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.