పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం, లంకెలకూరపాడులో విజిలెన్స్ అధికారులు ఆదివారం శ్రీనివాస ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో తనిఖీలు చేపట్టారు.అధికారులు గోదాముల్లో నిల్వలకు,రికార్డులకు వ్యత్యాసం గుర్తించారు.ఏడు లక్షల విలువ చేసే 32 మెట్రిక్ టన్నుల ఎరువులులను సీజ్ చేశారు.వైసీపీ ఎంపీటీసీ చెందిన దుకాణం పై 6A కేసు నమోదు చేశారు.శ్రీనివాస ట్రేడర్స్ షాపు లైసెన్స్ సస్పెన్షన్ కోసం సిఫార్సు చేసామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.