ఆశావర్కర్లకు పెండింగ్ పారితోషకాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్య దర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆశలపై అధికారుల వేధింపులను ఆపాలన్నారు.