జమ్మికుంట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వదేశీ పత్తి రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు.తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం స్థానిక గాంధీ చౌరస్తాలో ప్లే ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తు సుంకాల రద్దు జీవో ప్రతులను దహణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్స్ టైల్ యజమానుల కోరిక మేరకు విదేశీ పత్తిపై సుంకాన్ని రద్దు చేశామనడం ఆవివేకం అని అన్నారు దేశం నుండి ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులపై అమెరికా దేశం 20% నుండి 50% టాక్స్ పెంచితే మన కేంద్ర ప్రభుత్వం ఉన్న 11% ట్యాక్సీ రద్దు చేయడంతో మన దేశ అభివృద్ధి రైతుల అనేక ఇబ్బందులు పడతారని అన్నారు.