అల్విన్ కాలనీ చివరి బస్ స్టాప్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమికి అధికారులు కంచ ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని కొందరు అక్రమంగా వాహనాల పార్కింగ్ కోసం వాడుకుంటున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన హైడ్రాధికారులు, పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు కంచే ఏర్పాటు చేశారు. అధికారుల చర్యలను స్థానికులు స్వాగతించారు.