విజయనగరం జిల్లా రాజాం కోరమండల్ ఫెర్టిలైజర్ షాప్ వద్ద శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం మూడు రోజుల నుంచి తిరుగుతున్నా ఇవ్వడం లేదని చెబుతున్నారు. స్టాకు ఈరోజు వచ్చినా డీడీ నంబరు రాకపోవడంతో రైతులకు యూరియూ పంపిణీ చేయడం లేదని షాపువారు తెలియజేశారు. దీంతో రైతులు ఆగ్రహించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.