ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల ప్రజలు శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో జలజీవన్ మిషన్ కింద శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. తర్వాత స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారితో చర్చించారు.