ఆదోనిలోని పూల బజార్ లో ఉన్న శ్రీ నగరేశ్వర ఆలయంలో శ్రావణమాస శుక్రవారం సందర్భంగా మహిళలు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజలు ఘనంగా చేశారు. అమ్మవారికి పూలతో అలంకరణ చేసి, వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు. కుటుంబాల సంక్షేమం, ఆర్థిక సౌభాగ్యం కోసం స్త్రీలు శ్రద్ధా భక్తులతో ప్రార్థనలు చేశారు. ఈ భక్తి కార్యక్రమాలు శ్రావణమాసంలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు.