కోసిగి: మండలంలోని సిద్దప్పపాళెం ఎస్సీ కాలనీలో గురువారం దొంగతనం జరిగింది. యజమాని భీమయ్య విధులకు వెళ్లగా, భార్య ఈరమ్మ బంధువుల పెళ్లికి వెళ్లింది. ఈ సమయంలో దొంగలు ఇంటి పక్కన ఉన్న మెట్ల నుంచి మిద్ది పైకి ఎక్కి జాలిని తొలగించి, ఇంట్లోకి ప్రవేశించి బిరువా ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండి, రూ. 10 వేల నగదును అపహరించారు. బాధితులు కోసిగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.