కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల పట్టణం మైదుకూరు రోడ్డులో హారిక గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో నూతన ప్రారంభోత్సవ సందర్భంగా ఆగస్టు 20 తేదీ లోపు బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి శనివారం మునగాల రాజశేఖర్ కూపన్లు అందజేశారు. ఈరోజు ఎస్సై కొండారెడ్డి చేతులమీదుగా లక్కీ డ్రా ను తీసి విజేతలను ప్రకటించారు. ఇందులో మొదటి బహుమతి 10000 నర్సాపురం గ్రామము, రెండో బహుమతి 5000 ఎస్టి కాలనీ పోరుమామిళ్ల, మూడవ బహుమతి 3000 అక్కివారిపల్లె గ్రామము వారు గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు ప్రతి ఒక్కరికి 5 కేజీల వంతున ముగ్గురికి 15 కేజీల లడ్డును మార్కాపురం వెంకట శివ అందజేశారు.