గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ, ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. శనివారం మధ్యానం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.