ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే.. మధ్యాహ్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ బారిన పడ్డ బిచ్కుంద మండలం శెట్లూర్ ప్రాథమిక పాఠశాల 21 మంది విద్యార్థులను మంగళవారం మధ్యాహ్నం 3.30 జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తారా పరామర్శించారు. బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్దులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు, పెద్ద దేవడ మాజీ సర్పంచ్ మల్లికార్జున్ దేశయి, జిల్లా