ఆర్మూర్ పట్టణంలో శ్రీ నవనాథ సిద్దేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ఆర్మూర్ పిరమిడ్ స్పిరచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింస మేఘ శాఖహార ర్యాలీనీ ఆదివారం మధ్యాహ్నం 1:45 నిర్వహించారు. ఈ ర్యాలీని పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ మీదుగా క్షత్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. అహింసే మార్గంగా జీవహింసకు దూరంగా ఉండాలని మూగజీవ హింస సరైంది కాదని తెలిపారు.