మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న సింహాచలం ఈవో స్తానిక మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సింహాచలం ఆర్జేసీ, ఈవో వి.త్రినాధరావు బుధవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం త్రినాధరావు నాగపుట్టలో పాలు పోసి, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు, త్రినాధరావును ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.