బెల్లంకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా 15 లక్షల 58 వేల రూపాయలతో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణం చేపట్టినట్లు పాఠశాల హెచ్ఎం శాంతి గురువారం తెలిపారు. అలానే పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మాణం కిచెన్ గార్డెన్ కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంకుడు గుంత నిర్మాణంతో వర్షపు నీరు తో ఇబ్బంది తొలగినట్లు తెలిపారు. కిచెన్ గార్డెన్లో మొక్కల పెంపకం చేపడతామన్నారు.