జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యత్వాల నమోదు పారదర్శకంగా చేపడుతున్నామని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, ఛానల్లలో పని చేసే వర్కింగ్ జర్నలిస్టులకే ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కల్పిస్తామన్నారు. ఇది ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ కావున ఇందులో ఇతర యూనియన్ ల సభ్యులకు అవకాశం లేదని తెలిపారు. ఇతర యూనియన్ల నుండి ఆసక్తి, అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులు ఐజేయులో సభ్యత్వం తీసుకుంటే ఈ ప్